'సింగమ్ అగైన్' ట్రైలర్ వచ్చేసింది!
2 months ago | 5 Views
అజయ్ దేవ్‌గణ్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం 'సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో రోహిత్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆక్టటుకునేలా సాగింది. ఈ ఏడాది నవంబర్ ఈ సినిమా ఇది విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి , అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న ఈ తాజా చిత్రం 'సింగం అగైన్' బ్లాక్ బస్టర్ 'సింగం’ ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది. 'సింగం అగైన్' అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను పంచుకుంది. రామాయణం బేస్‌డ్ చేసుకుని ఈ సినిమాను రూపోదించినట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగిన ఈ ట్రైలర్‌ను విూరు చూసేయండి. ఈ మూవీలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇంకా చదవండి: దసరాకు సై అంటున్న కొత్త చిత్రాలు