'మట్కా' ట్రైలర్ రిలీజ్.. 14న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
1 month ago | 5 Views
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా' . 'పలాస 1978' సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఈ ట్రైలర్‌ను పంచుకున్నారు. ''సర్కస్‌లో జోకర్‌ను చూసి జనం అంతా నవ్వుతారు చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని అదే సర్కస్‌లో పులులను, సింహాలను ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు రింగ్ మాస్టర్’’.అంటూ మాస్ ఎలివేషన్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక ట్రైలర్ చూస్తే.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుండగా.. వరుణ్ తేజ్ ‘వాసు’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !