బిగ్ బాస్ సెట్స్ లో విడుదల అయిన "35 చిన్న కథ కాదు" ట్రైలర్ విడుదల
3 months ago | 55 Views
రానా దగ్గుబాటి సమర్పణలో న్యూ ఏజ్ క్లీన్ ఫ్యామిలీ డ్రామా '35-చిన్న కథ కాదు' టీజర్, పాటలతో బజ్ క్రియేట్ చేసింది. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ రోజు కింగ్ నాగార్జున సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మ్యాథ్స్ సబ్జెక్ట్ తో ఇబ్బంది పడుతున్న ఓ స్టూడెంట్ ని పరిచయం చేస్తూ ట్రైలర్ ఓపెన్ అయ్యింది. తల్లిదండ్రుల పాత్రలు పోషించిన నివేద థామస్, విశ్వదేవ్ ఆ చిన్నన పిల్లాడి భవిష్యత్ విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఆ పిల్లాడిని ఫ్రెండ్స్, టీచర్స్' సున్నా' అని పిలుస్తుంటారు. చిన్న పిల్లవాడు సవాళ్లను అధిగమించి, 35 మార్కులతో ఉత్తీర్ణత సాధించగలిగాడా అనేది కథలో ప్రధానాంశం.
దర్శకుడు నంద కిషోర్ ఈమని చాలా ఎఫెక్టివ్ గా సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేశారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథని అద్భుతంగా ప్రజెంట్ చేశ్రని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. విశ్వదేవ్, నివేదా థామస్ మధ్యతరగతి తల్లిదండ్రులుగా తమ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. ప్రియదర్శి, గౌతమి , భాగ్యరాజ్ తమ పాత్రల ద్వారా కథకు డెప్త్ ని యాడ్ చేశారు.
సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి గ్రామీణ నేపథ్యాన్ని ఎఫెక్టివ్‌గా తీశారు. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని అందంగా తీర్చిదిద్దింది. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. టీసీ ప్రసన్న ఎడిటింగ్ బ్రిలియంట్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
'35-చిన్న కథ కాదు' తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
తారాగణం: నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
ఇంకా చదవండి: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ 'ఉత్సవం' థాట్-ప్రొవొకింగ్ ట్రైలర్ రిలీజ్
# 35ChinnaKathaKaadu # RanaDaggubati # NivethaThomas # Nagarjuna