ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా "మన్మయి" సినిమా టీజర్ విడుదల

4 months ago | 39 Views

G2H మీడియా పతాకంపై సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్,ప్రధాన పాత్రధారులుగా పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో, నిర్మాతలు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి  సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ "మన్మయి". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ నాగ మహేష్, బాలీవుడ్ ఆర్టిస్ట్ కరెన్ సింగ్ , ఆర్టిస్ట్ జయంత్, ఆర్టిస్ట్ యోగి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - "మన్మయి" టీజర్ లాంఛ్ కు రమ్మని డైరెక్టర్ రామకృష్ణరెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు. కొన్ని స్టిల్స్ చూపించారు. బాగున్నాయనిపించింది. ఇక్కడకి వచ్చి టీజర్ చూశాక మంచి కంటెంట్ తో సినిమా చేస్తున్నట్లు అర్థమైంది. "మన్మయి" సినిమా మీ ఆదరణ పొందాలి. మంచి సక్సెస్ కావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ పులుగు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ - మా "మన్మయి" సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత  రాజ్ కందుకూరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ రోజు మా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. "మన్మయి" ఒక ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది. మంచి మూవీ చేశామనే అనుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలి. అన్నారు.

నిర్మాత శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ - మా "మన్మయి" సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత  రాజ్ కందుకూరి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రోజు మా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మంచి లవ్ స్టోరీతో మిమ్మల్ని మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ - మా "మన్మయి" సినిమా టీజర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా మూవీ టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సంతోష్ కృష్ణ మాట్లాడుతూ - నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన మా బ్రదర్ రామకృష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్. మా మన్మయి మూవీ టీజర్ స్క్రీన్ మీద మీరు చూసి చప్పట్లు కొట్టగానే చాలా సంతోషంగా అనిపించింది. మీకు టీజర్ నచ్చిందంటే మా వర్క్ నచ్చిందనే భావిస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్ మూవ్ మెంట్ మా అందరికీ. మనసుకు హత్తుకునే మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. అన్నారు.

నటుడు శిజు మాట్లాడుతూ - దేవి సినిమాతో మీ అందరికీ గుర్తుండిపోయాను. ఆ సినిమా రిలీజై పాతికేళ్లవుతోంది. డైరెక్టర్ గారు "మన్మయి" కథ చెప్పినప్పుడు ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అనిపించింది. ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ కలిగించే సినిమా అవుతుంది. అన్ని ఎమోషన్స్ కథలో బాగా కుదిరాయి. అన్నారు.

హీరోయిన్ వైష్ణవి కృష్ణ మాట్లాడుతూ - "మన్మయి" సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్ రోలర్ కోస్టర్ సినిమా అనుకోవచ్చు. తెలుగు మూవీస్ లో ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని చెప్పగలను. అమేజింగ్ టీమ్ తో వర్క్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు

నటీనటులు - సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్, యోగి కత్రి, జయంత్, నేహాల్ గంగావత్, మెహబూబ్ భాష, శిరీష, భూపతి, సాయి, కల్కి, రాజేశ్వరి తదితరులు 

టెక్నికల్ టీమ్

సంగీతం: వరికుప్పల యాదగిరి

బ్యాగ్రౌండ్ మ్యూజిక్: మహి మదన్. ఎం .ఎం 

డి ఓ పి: కె కే రావు

అడిషనల్ డి. ఓ. పి: కిషోర్ బోయిడపు

ఎడిటర్: సాయిబాబు తలారి

కొరియోగ్రఫీ: చందు

పిఆర్ఓ: వీరబాబు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్; సుబ్బారావు

నిర్మాతలు: పులుగు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పద్మజ ఇరకసాని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పులుగు రామకృష్ణారెడ్డి

ఇంకా చదవండి: విప్లవ కవి గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం' ఈనెల 30న గ్రాండ్ రిలీజ్

# Manmayi     # RajKandukuri     # SantoshKrishna    

trending

View More