'మత్తు వదలరా-2' ప్రచారంలో టీమ్‌..

'మత్తు వదలరా-2' ప్రచారంలో టీమ్‌..

3 months ago | 46 Views

శ్రీసింహా హీరోగా దర్శకుడు రితేశ్‌ రానా తెరకెక్కించిన చిత్రం 'మత్తు వదలరా -2’. ఇందులో ఫరియా అబ్దుల్లా, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారం కోసం 'మత్తు వదలరా 2’ టీమ్‌ తాజాగా రాజమౌళిని కలిసింది. రాజమౌళిని 'మత్తువదలరా’ టీమ్‌  అప్‌డేట్‌ అడగ్గా.. ఆయన ఫన్నీగా స్పందించారు. ఆస్కార్‌ అవార్డు విజేత ఎమ్‌.ఎమ్‌ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్‌ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మత్తు వదలరా 2’. బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రితేశ్‌ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సరిగ్గా ప్రమోషన్స్‌ అవ్వట్లే అని క్రియేటివ్‌గా ఒక వీడియోను వదిలింది చిత్రయూనిట్‌. అయితే ఈ వీడియోలో 'మత్తు వదలరా 2' ప్రమోషన్స్‌తో పాటు మహేశ్‌-రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాపై కూడా హింట్‌ ఇచ్చారు.

ఇంకా చదవండి: బెల్లంకొండ సినిమాలో సంయుక్త!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Matthuvadalara2     # Fariaabdullah     # Satya    

trending

View More