సిల్క్‌ స్మిత జీవిత కథ!

సిల్క్‌ స్మిత జీవిత కథ!

1 month ago | 5 Views

సినిమా అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సిల్క్‌ స్మిత. 80లలో అగ్రహీరోలతో కలిసి నటించి తన హాట్‌ హాట్‌ అందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. కైపెక్కించే కళ్లతో మత్తెక్కించే అందంతో కుర్రకారు గుండెల్ని పిండేసింది. సిల్క్‌ స్మిత ఉందంటే చాలు ఆ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అయితే సిల్క్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో మరో బయోపిక్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో ది డర్టీ పిక్చర్‌ అంటూ సినిమా రాగా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఇప్పుడు సౌత్‌ నుంచి సిల్క్‌ లైఫ్‌ స్టోరీపై మరో సినిమా రాబోతుంది.


సిల్క్‌ స్మితా ది క్వీన్‌ ఆఫ్‌ ది సౌత్‌ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. చంద్రికా రవి సిల్క్‌ పాత్రలో నటించబోతుంది. ఈ చిత్రంతో జయరామ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.  కాగా నేడు సిల్క్‌ స్మిత జయంతి. ఈ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌ చూస్తుంటే.. 80లలో సిల్క్‌ స్మిత తన నటనతో ఎంత పాపులర్‌ అయ్యిందో చూడవచ్చు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా స్కిల్‌ స్మిత గురించి అడిగి తెలుసుకుంది అంటే ఎంత ఇంపాక్ట్‌ చూపించిందో చెప్పనవసరం లేదు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందో భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: నేనేం ఐటమ్‌ గర్ల్‌ను కాదు.. : తమన్నా

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# చంద్రికా రవి     # సిల్క్‌స్మిత    

trending

View More