'సన్నాఫ్‌ సునావిూ' ప్రారంభం!

'సన్నాఫ్‌ సునావిూ' ప్రారంభం!

23 days ago | 11 Views

దిలీప్‌ కుమార్‌ రాథోడ్‌, అరవింద్ అగర్వాల్‌, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సన్నాఫ్‌ సునావిూ’ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ’శతృవుల గుండెల్లో దడ’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమాతో పాటు ’బాలతేజం’ అనే సినిమా కూడా ప్రారంభమవడం విశేషం. ఈ రెండు చిత్రాలను కృష్ణ ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్‌ 

నిర్మిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌ కొట్టారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో తెలుగు తెరపైకి ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా 'సన్నాఫ్‌ సునావిూ’ రాబోతుందని మేకర్స్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.  కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ.. ’సన్నాఫ్‌ సునావిూ’ నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెప్ట్‌ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్‌కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ద్వారా పూర్తి సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు.

నటీనటులు :

ఇరిగే రమేష్,షన్ను,అరవిందా, స్వర్ణలత,దుర్గా,మంజుల, కవిత, విజయ్ గుర్రపు, కెవిఎల్ నరసింహారావు , జబర్దస్త్ అప్పారావు, రామకృష్ణ ,సైదులు ,చెన్నకేశవ నాయుడు

సాంకేతిక వర్గం :

బ్యానర్ : కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్

దర్శకత్వం : చిత్తజల్లు ప్రసాద్

నిర్మాత: కృష్ణ ప్రసాద్

D.O.P: నితీష్ (UP)

సంగీతం: కె .లక్ష్మణ్ సాయి

ఇంకా చదవండి: హీరో విశ్వక్‌ సేన్ చేతుల మీదగా విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్

# Irigeramesh     # Shannu     # Aravinda