పూర్తి కావస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌

పూర్తి కావస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌

3 days ago | 10 Views

టాలీవుడ్‌ సినీ జనాలతోపాటు పాన్‌ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాంచరణ్‌  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. కాగా ఈ చిత్రం చాలా కాలం నుంచి షూటింగ్‌ జరుపుకుంటుందని తెలిసిందే. ఇంతకీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. కొత్త అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం శంకర్‌ కాంపౌండ్‌ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ ఇంకా 10`15 రోజులు మాత్రమే మిగిలి ఉందని శంకర్‌ చెప్పాడు.

ఇండియన్‌ 2 విడుదలవగానే వీలైనంత త్వరగా గేమ్‌ ఛేంజర్‌ను పూర్తి చేస్తానని చెప్పడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటు న్నారు. ఈ మూవీలో సునీల్‌, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్‌ యాక్లర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్‌ఛేంజర్‌లో రాంచరణ్‌ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.. కాగా తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

ఇంకా చదవండి: వెంకటేష్ తో అనిల్‌ రావిపూడి చిత్రం.. యాక్షన్‌ నేపథ్యంలో మూవీ

# Gamechanger     # Ramcharan     # Kiaraadvani