తుది దశకు చేరుకున్న '7G బృందావన కాలనీ 2' చిత్రీకరణ

తుది దశకు చేరుకున్న '7G బృందావన కాలనీ 2' చిత్రీకరణ

2 days ago | 5 Views

దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో '7G బృందావన కాలనీ' చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా '7G బృందావన కాలనీ 2' రూపొందుతోంది.

శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.

'7G బృందావన కాలనీ 2' చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన రవికృష్ణ, మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన సరసన అనశ్వర రాజన్‌ నటిస్తున్నారు.

సీక్వెల్ పై ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేలా, ఈ చిత్రంలో జయరామ్, సుమన్ శెట్టి, సుధ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మొదటి భాగం విజయంలో యువన్ శంకర్ రాజా యొక్క అద్భుతమైన సంగీతం కీలక పాత్ర పోషించింది. సీక్వెల్ తో కూడా ఆయన మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేయబోతున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు రామ్‌జీ తనదైన కెమెరా పనితనంతో సీక్వెల్ కి మరింత అందం తీసుకురానున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ "7G బృందావన కాలనీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త మరియు ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యాజిక్‌ను పునఃసృష్టి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము." అన్నారు.

'7G బృందావన కాలనీ 2' అనేది సెల్వరాఘవన్ శైలి కథాకథనాలు, బలమైన భావోద్వేగాలతో రూపొందుతోన్న హృదయాలను హత్తుకునే ఓ విభిన్న ప్రేమ కథా చిత్రం. ఇది ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేని సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఇంకా చదవండి: రామ్ పోతినేని -  మహేష్ బాబు పి - మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో మహాలక్ష్మిగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# 7Gబృందావనకాలనీ2     # రవికృష్ణ     # జయరామ్    

related

View More
View More

trending

View More