ఈ యేడు బడా సినిమాల సందడి.. లైన్‌లో కల్కి, పుష్ప, దేవర,గేమ్‌ ఛేంజర్‌!

ఈ యేడు బడా సినిమాల సందడి.. లైన్‌లో కల్కి, పుష్ప, దేవర,గేమ్‌ ఛేంజర్‌!

2 months ago | 21 Views

ఈ సంవత్సరం నాలుగు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అవి ఒక్క తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు విడుదల తేదీలు, ప్రచారాలు అప్పుడే మొదలు పెట్టేసారు. ఇంకో రెండు సినిమాలు ఇంకా చిత్రీకరణ దశలోనే వున్నాయి, కానీ ఆ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరమే విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలకి పెట్టిన బ్జడెట్‌ వీటిపై వచ్చే వ్యాపారాలు సుమారు రూ. రెండువేల కోట్లకి పైగా ఉంటుందని ట్రేడ్‌ విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకీ ఈ నాలుగు సినిమాలు ఏవంటే, ముందుగా జూన్‌ 27 న విడుదలవుతున్న 'కల్కి 2898 ఏడి’. ఇందులో ప్రభాస్‌ కథానాయకుడు కాగా, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటాని, ఇంకా చాలామంది నటీనటులు వున్నారు.

Kalki 2898 AD Trailer | kalki teaser | Kalki Trailer | Prabhas | Deepika  Padukone | Amitabh Bachchan - YouTube

ఇది ఒక సైన్స్‌ ఫిక్షన్‌ కథ అని చెపుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు కాగా, అశ్విని దత్‌ నిర్మాత. ఈ సినిమాకి సుమారు రూ. 600 కోట్లు బడ్జెట్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక రెండో సినిమా 'పుష్ప 2: ది రూల్‌’. ఇది ఆగస్టు 15న విడుదలవుతోంది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకుడు. ఇది 'పుష్ప: ది రైజ్‌’ అనే సినిమాకి సీక్వెల్‌ గా అంటే రెండో భాగంగా వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్‌ ప్లిక్స్‌ ఇప్పటికే రూ.275 కోట్లకి తీసుకుందని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమా హిందీ హక్కులు అనిల్‌ తడాని రూ. 200 కోట్లకు తీసుకున్నారని ఇంకో వార్త కూడా వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం హిందీలో సుమారు రూ.125 కోట్ల వ్యాపారం చేసింది కాబట్టి, ఇప్పుడు రెండో భాగం అంతకన్నా ఎక్కువ చేస్తుందని నమ్ముతున్నారు. 

Pushpa 2 The Rule Poster: Allu Arjun Sets Internet On Fire With New Poster,  Teaser To Be OUT Tomorrow At THIS Time | Telugu News - Times Now

మూడో సినిమా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 'దేవర’ సినిమా. బాలీవుడ్‌ నటి, శ్రీదేవి బోనీ కపూర్‌ ల కుమార్తె జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది, ఇందులో మొదటి భాగం ముందుగా అనుకున్న తేదీ ప్రకారం అయితే ఈపాటికి విడుదలైపోవాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా విడుదల దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 10 కి వాయిదా వేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తరువాత ఎన్టీఆర్‌ చేస్తున్న పాన్‌ ఇండియా సినిమా ఇదే. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం వున్నా, ఇది ఎన్టీఆర్‌ కి ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా వుండబోతోంది. తెలుగులో కాకుండా పాన్‌ ఇండియా లెవెల్లో అతని స్టామినా ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపితం అవుతుంది కాబట్టి, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Devara new update out! Jr NTR resumes shoot of Koratala Siva's film - India  Today

ఇక నాలుగో సినిమా రామ్‌ చరణ్‌, దర్శకుడు శంకర్‌ ల కలయికలో వస్తున్న 'గేమ్‌ చేంజర్‌’. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సంవత్సరమే విడుదలవుతుందని మాత్రం అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి రెండు సంవత్సరాలకి పైగా అవుతున్నా ఇంకా జరుగుతూనే వుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక, కాగా ఈ సినిమాలో అంజలి, జయరాం, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర, సునీల్‌ ఇలా చాలామంది నటీనటులు వున్నారు. శంకర్‌ ఈ సినిమాతోపాటుగా కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'భారతీయుడు 2’ సినిమాకూడా చిత్రీకరణ చెయ్యాల్సి రావటంవలన ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం జరిగింది అని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్‌ రాజు, అతని నిర్మాణంలో చిత్రీకరణ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న సినిమా ఈ 'గేమ్‌ చేంజర్‌’ మాత్రమే అని అంటున్నారు. ఈ సినిమా బ్జడెట్‌ సుమారు రూ.300 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వ్యాపారం ఇంకా ముగియలేదని, ఈ సినిమా విడుదల తేదీ ఖరారైతే అప్పుడు వ్యాపారలావాదేవీలు పూర్తవచ్చు అని అంటున్నారు. ఈ నాలుగు పెద్ద సినిమాలు ఈ సంవత్సరమే విడుదలవుతున్నాయి, ఈ సినిమాలపై వేలకోట్ల రూపాయల వ్యాపారం జరగబోతోంది. అలాగే పరిశ్రమ మనుగడ కూడా ఈ నాలుగు సినిమాలపై వుంది.

Game Changer: 5 things we know about Ram Charan, Kiara Advani's film so far  - Hindustan Times

ఇంకా చదవండి: 'తలైవా' జీవితం ఆధారంగా చిత్రం!

# Gamechanger     # Pushpa2     # Devara     # Kalki2898AD     # TeluguCinema    

trending

View More