ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటుంది.. మీడియా సమావేశంలో చిత్రయూనిట్
7 days ago | 5 Views
ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల చిత్రం రాబోతోంది. కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఒప్పుకున్నారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. మంచి టీం ఉంటేనే మంచి సినిమాను తీయగలుగుతాం. ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చెరసాల చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 11న రాబోతోన్న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
హీరో శ్రీజిత్ మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా దర్శకుడు ఈ చిత్రం మీద నాలుగేళ్లు ఫోకస్ పెట్టాడు. మధ్యలో ఇతర ఆఫర్లు వచ్చినా కూడా మా సినిమా మీదే దృష్టి పెట్టాడు. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. మా సినిమా ఏప్రిల్ 11న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ .. ‘నాకు చెరసాల చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇది నాకు తెలుగులో తొలి చిత్రం. ఇందులో నేను ప్రియ అనే అద్భుతమైన పాత్రను పోషించాను. ఇంత మంచి సినిమాలో పని చేయడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ రామ్ ప్రకాష్ గారు సినిమాను అద్భుతంగా మలిచారు. మేం కష్టపడి, ఇష్టపడి సినిమాను చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నాను. ఏప్రిల్ 11న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నటి రమ్య మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘చెరసాల చిత్రం అద్భుతంగా వచ్చింది. ప్రతీ ఒక్కరూ చక్కగా నటించారు. ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.
ఎడిటర్ భాను నాగ్ మాట్లాడుతూ .. ‘నాకు దర్శకుడితో ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఈ చెరసాల చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఏప్రిల్ 11న థియేటర్‌కు వచ్చి మా అందరినీ ప్రేక్షకదేవుళ్లు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఇంకా చదవండి: ఐకాన్ స్టార్ & అట్లీ – కొత్త సినిమా అనౌన్స్‌మెంట్
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"