'ది రాజా సాబ్' స్పెషల్ మోషన్ పిక్చర్ విడుదల!
2 months ago | 5 Views
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్’ మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్ సింహాసనం విూద ఓ చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. హారర్, కామెడీ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టు అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు నుంచి తరచుగా అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పారు. అందరినీ 'ది రాజా సాబ్' ప్రపంచంలోకి తీసుకెళ్తామని ఆయన హావిూ ఇచ్చారు. ఇటీవల ప్రభాస్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా అది క్షణాల్లో వైరలైంది. అందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు ప్రభాస్. ఆ అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదలైన వీడియో ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఏచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇంకా చదవండి: నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన శివకార్తికేయన్, సాయి పల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, 'అమరన్' గ్రిప్పింగ్ ట్రైలర్