ఘనంగా 'పోలీస్ వారి హెచ్చరిక' ఆడియో లాంచ్ ఈవెంట్!

ఘనంగా 'పోలీస్ వారి హెచ్చరిక' ఆడియో లాంచ్ ఈవెంట్!

7 days ago | 5 Views

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ "పోలీస్ వారి హెచ్చరిక "!. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. 

ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ.. "నేను గతంలో బాబ్జీ తో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను.   ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.

తమ్మా రెడ్డి భరద్వాజ గారు మాట్లాడుతూ.." సమాజంలో జరిగే చెడులను ప్రశ్నించే సినిమాలు రావాలి. ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందిన సినిమా. గతంలో ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మోహన్ బాబు గారు లాంటి నటులు ఎర్ర జెండాను పట్టుకొని కమ్యూనిస్ట్ అంశాలతో చక్కటి సందేశాత్మక చిత్రాలు తీశారు. ఆ సినిమాలను జనాలు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాబ్జీ అలాంటి ఆశయాలతో  ఈ సినిమా చేశారు.  విలువలతో కూడిన సందేశాత్మక సినిమాలను కచ్చితంగా మనం సపోర్ట్ చెయ్యాలి. ఇలాంటి సినిమాని అందిస్తున్నందుకు డైరెక్టర్ బాబ్జికి, నిర్మాత బెల్లి జనార్దన్ కి అభినందనలు తెలుపుతున్నాను "అన్నారు .....!!

జయసుధ గారు మాట్లాడుతూ, " బాబ్జి సినీ పరిశ్రమ లోకి వచ్చినప్పటి నుంచి  నాకు బాగా పరిచయం . చాలా అద్భుతమైన డైరెక్టర్.. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా తీశారు. సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పాటలు విన్నాను. వినసొంపుగా చాలా బాగున్నాయి. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ బాబ్జీ గారికి, నిర్మాత బెల్లి జనార్దన్ గారికి ఆల్ ది బెస్ట్ " అని అన్నారు.

ఇక ఆర్ నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. " ప్రజా నాట్యమండలి  వేదిక నుంచి వచ్చిన బాబ్జీ  తీసిన ఈ  సినిమా  గురించి విన్నప్పుడు ఇది సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సినిమా అని అర్థమయ్యింది . ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. ఈ సందేశాత్మక చిత్రం ఘన విజయం సాధించాలి. బాబ్జి గారు  మంచి సినిమా తీయడం కోసం ఎంత టైం అయినా తీసుకొని ఆ సినిమా బాగా వచ్చే దాకా కష్టపడతారు. ఇప్పుడు ఆయన బిడ్డతో ఇంత మంచి సినిమా తీశారు. ఆయన నుంచి జనాలకి ఉపయోగపడేలా మంచి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటూ, బాబ్జికి, నిర్మాత బెల్లి జనార్దన్ కి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను" అని అన్నారు.

అజయ్ ఘోష్ గారు మాట్లాడుతూ...."" నాకు ఈ చిన్న గుర్తింపు రావడానికి కారణం కమ్యూనిస్ట్  పార్టీ ...నేను  కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని కాకపోయినా నా కుటుంబం అంతా కూడా కమ్యూనిజంకే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లో నేను  చాలా గొప్ప  పాత్రను  పోషించాను .... ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి.  ఈ సినిమా విడుదల తరువాత మా దర్శకుడు బాబ్జీ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా సినీ పరిశ్రమలో తనదైన సంతకం చేసేస్తారు . నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ బాబ్జీ గారికి, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని అన్నారు....!

ఈ పాటల పండగ లో  విశిష్ట అతిథులుగా హాజరయిన  వివిధ వామ పక్ష పార్టీల నేతలు శాసన సభ సభ్యులు కూనంనేని సాంబశివ రావు , యo ఎల్  సి సత్యం , సిపిఎం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారలు మాట్లాడుతూ "" వామ పక్షాల ఐక్యతను చాటేలా  యీ సినిమా  ఆడియో ఫంక్షన్ కు మేము హాజరయ్యాము.... ఒక గొప్ప సామాజిక  లక్ష్యం తో  మా ప్రజా నాట్యమండలి  బాబ్జీ  రూపొందించిన  ఈ సినిమాను  జనం లోకి తీసుకెళ్లి  దీనిని విజయవంతం చేయాలని , తద్వారా  రాబోయే రోజులలో  ప్రజలకు  ఉపయోగపడే  ఇటువంటి చిత్రాలు మరిన్ని రావడానికి రెండు రాస్త్రాలలోని  మా పార్టీల , ప్రజా  సంఘాల సభ్యులు , అభిమానులు  కృషి చేయాలని మేము ఈ వేదిక నుంచి సంయుక్తం గా పిలుపు ఇస్తున్నామని "" ప్రకటించారు ....!!!

సినిమా వివరాలు:

సినిమా పేరు: పోలీస్ వారి హెచ్చరిక

నటి నటులు: సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, గిద్దెష్, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ, జయవాహిని, శంకరాభరణం తులసి, ఖుషి మేఘన, రుచిత, గోవిందా, హనుమ, బాబురామ్ తదితరులు.

కెమెరా:కిషన్ సాగర్ , నళిని కాంత్

మ్యూజిక్: గజ్వేల్ వేణు

ఎడిటర్: షార్వాణి శివ

పబ్లిసిటీ & స్టిల్స్ : శ్రీకాంత్ భోక్రె

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : హనుమంత రావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: N. P. సుబ్బారాయడు

ప్రొడ్యూసర్: బెల్లి జనార్దన్

రచన మరియు దర్శకత్వం: బాబ్జి

పిఆర్ఓ : మధు VR

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

ఇంకా చదవండి: ఈ నెల 25 న ‘సారంగపాణి జాతకం’

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# పోలీస్ వారి హెచ్చరిక     # సన్నీ అఖిల్     # అజయ్ ఘోష్    

trending

View More