నవంబర్‌ నుంచి 'దేవర 2' షూటింగ్‌ ప్రారంభం

నవంబర్‌ నుంచి 'దేవర 2' షూటింగ్‌ ప్రారంభం

1 month ago | 5 Views

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్‌ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్‌-2’ స్క్రిప్ట్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్‌ కొరటాల శివ, తన టీమ్‌తో గత కొన్ని వారాలుగా వర్క్‌ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

దేవర-2' పై కొత్త అప్ డేట్ ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT  Reviews, Ratings

ఇంకా అధికారిక అప్‌డేట్‌ రానప్పటికీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించారు. సైఫ్‌అలీ ఖాన్‌ విలన్‌ పాత్ర పోషించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘వార్‌-2’ షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్‌, ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టారు.
ఇంకా చదవండి: రామ్ మధ్వాని ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ టీజర్ విడుదల.. మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎన్టీఆర్‌     # దేవర    

trending

View More