‘ఏ ఎల్ సి సి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్ వేడుకను ప్రముఖ దర్శకుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు!
12 days ago | 5 Views
యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ''ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కృతజ్ఞతలు. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా వారికి బాగా తెలుసు. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి." అని అన్నారు.
హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. "ముందుగా స్టేజి మీద ఉన్న పెద్దలందరికి నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. లేలీధర్ రావు గారు ఒక టీచర్.. అలాంటిది ఆయన ఒక ప్యాషన్ తో డైరెక్టర్ గా మారి ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది." అని అన్నారు.
డైరెక్టర్ నగేష్ గారు మాట్లాడుతూ.. "ముందుగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్కారాలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే విషయం పక్కనపెడితే.. వైవిధ్యమైన సినిమాలను తప్పకుండా ప్రోత్సహించండి. ఈ సినిమా చిన్న సినిమా అయినా, ఒక వైవిధ్యమైన సినిమా. డైరెక్టర్ లేలీధర్ రావు కోలా గారు చాలా బాగా తీశారు. నష్టాలు వస్తున్నాయని రైతు వ్యవసాయం ఆపడు. మేము కూడా అంతే. సినిమాలు ప్లాప్ అవుతున్నాయని సినిమాలు చెయ్యడం మానము. ఇంకా కొత్త కొత్త సినిమాలు చెయ్యడానికి ప్రయత్నిస్తాం." అని అన్నారు.
డైరెక్టర్ సముద్ర గారు మాట్లాడుతూ.. " లేలీధర్ రావు కోలా ఒక మంచి టీచర్. పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప గొప్ప పాఠాలు చెప్పారు. అలాంటి గొప్ప టీచర్ నేడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమా చేశారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను " అని అన్నారు.
ఇక ఈ సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. "మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన నగేష్ గారికి, సముద్రాల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని అన్నారు.
ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
కథ, మాటలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: లేలీధర్ రావు కోలా
సంగీతం: జస్వంత్ పి
సినిమాటోగ్రఫీ: యెస్ చరణ్ తేజ
మేకప్: ఆరవ్
కాస్ట్యూమ్స్: రూప దప్పేపల్లి
ఆర్ట్స్: అజయ్
ఎడిటింగ్: నిఖిల్ & రాజేష్
కొరియోగ్రాఫి: కార్తీక్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నాగ శ్రీహర్ష కశ్యా.
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
ఇంకా చదవండి: 'బద్రీ' చిత్రం రీ రిలీజ్‌కు సన్నాహాలు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!