ఆగష్టు 15న రానున్న 'తంగలాన్‌'

ఆగష్టు 15న రానున్న 'తంగలాన్‌'

3 days ago | 10 Views

కోలీవుడ్‌తో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రాలలో 'తంగలాన్‌' ఒకటి. తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు 'కబాలి’, 'కాలా’, 'సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్‌ పా రంజిత్‌  దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మొదట జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్  చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది.  ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్‌. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీని ఇండిపెండెన్స్‌ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్  చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆగష్టు 15 రేసులో ఉన్న 'పుష్ప 6' డిసెంబర్‌కు వాయిదా పడగా.. ఆ స్థానంలో రామ్‌- పూరీ కాంబోలో వస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ వస్తుంది.

ఇక ఆగష్టు 15 కి 'తంగలాన్‌' కూడా వస్తే బాక్సాఫీస్‌ క్లాష్‌ ఏర్పడే అవకాశం ఉంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, నీలమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొతు ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తుండగా.. 'సర్పట్ట పరంపర’ ఫేమ్‌ పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు. . ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ’సినిమా మ్యూజిక్‌ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంతవరకు బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చాను. సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే మైండ్‌ బ్లోయింగ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో ఇండియన్‌ మూవీ చరిత్ర సృష్టించనుంది’ అని పేర్కొన్నారు.  ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఓ సందర్భంలో విక్రమ్‌ దీని గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదన్నారు. విభిన్నకథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గ్లామర్‌కు చోటులేదన్నారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్తారని హావిూ ఇచ్చారు.

ఇంకా చదవండి: అజిత్‌ తాజా చిత్రం 'విడాముయర్చి'

# Thangalaan     # Vikram     # MalavikaMohanan     # TeluguCinema