'భారతీయుడు-2' బాగుందని అంటున్న తలైవా

'భారతీయుడు-2' బాగుందని అంటున్న తలైవా

5 months ago | 56 Views

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, సుప్రసిద్ద దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం  'భారతీయుడు-2' ఇటీవలే విడుదలయ్యింది. అయితే చిత్రానికి మొదటిరోజే భారీ ప్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్‌పై విమర్శలు వెలువెత్తాయి. కంటెంట్‌ లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. కానీ సినిమా మాత్రం  ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్‌ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్‌ కూడా నిరాశ చెందారు. ఈ చిత్రం తనకు నచ్చిందని సినిమా బాగుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కామెంట్స్‌ చేయడం అందర్నీ  ఆశ్చర్యపరిచింది. కేరళలోని ఓ వివాహానికి హాజరై చెన్నయ్‌ ఎయిర్‌పోర్టులో విూడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు రజనీకాంత్‌. దీంతో పాటు బయట ప్రచారం జరగుతున్నట్లుగా తన 'వేట్టయాన్‌’ సినిమా వాయిదా పడలేదని, షూటింగ్‌ శరవేగంగా జరుగు తుందని,తన పార్ట్‌ డబ్బింగ్‌ కూడా పూర్తయిందని.. దసరాకు చిత్రాన్ని విడుదల చేసే అవకాశం వుందని స్పష్టం చేశారు.

సూర్యతో 'కంగువ’ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా ఇంతకు ముందు 'వేట్టయాన్‌' వాయిదాపై మాట్లాడారు. దీంతో పాటు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' చిత్రంలో కూడా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా.. ఈ సినిమా రూపొందుతోంది. శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపిస్తారు.

ఇంకా చదవండి: ఆగస్టులో ముగ్గురు హీరోల సందడి... మూడు ప్రధాన సినిమాల విడుదల

# Bharateeyudu2     # KamalHaasan     # Rajinikanth     # RakulPreetSingh     # AamirKhan    

trending

View More