'గేమ్‌ఛేంజర్'కు పోటీగా 'తండేల్' విడుదల!?
2 months ago | 5 Views
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న ప్రాజెక్ట్ 'తండేల్' రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించగా.. 'తండేల్' విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. తాజాగా 'తండేల్' సంక్రాంతి బరిలో నిలువబోతుందన్న అప్‌డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న 'గేమ్ ఛేంజర్' 2025 జనవరి 10న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద 'గేమ్ ఛేంజర్'తో పోటీ పడటం ఖాయమైపోయినట్టే.
మరి 'తండేల్' రిలీజ్‌పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 'తండేల్'లో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో నటిస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 'తండేల్' నాగచైతన్య- చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
ఇంకా చదవండి: 'విశ్వం'కు బిగ్ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ రుణపడి ఉంటా: సక్సెస్ మీట్ లో హీరో గోపీచంద్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Gamechanger # Ramcharan # Tandel # NagaChaitanya