సిస్టర్‌ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు!

సిస్టర్‌ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు!

4 months ago | 31 Views

'కథ విన్న వెంటనే... ఎలాంటి సందేహం లేకుండా సిస్టర్‌ ఫ్రాన్సెస్కా పాత్రలో నటించడానికి అంగీకరించాను‘ అంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ నాయిక టబు.  ఎంతో మంది అగ్రతారల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. త్వరలో 'డ్యూన్‌:ప్రాఫెసీ’ అనే హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌తో రాబోతుంది. విజయవంత మైన 'డ్యూన్‌’ వెబ్‌సిరీస్‌కి ప్రీక్వెల్‌గా డెనిస్‌ విలలెనెయువ్‌ రూపొందిస్తున్న సిరీస్‌ ఇది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇందులోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఇందులో సిస్టర్‌ ఫ్రాన్సెస్కా పాత్రను పోషించడం మంచి అనుభవం. ఈ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అంగీకరించాను.

బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన పాత్ర ఇది. ఒక నటికి ఇలాంటి పాత్రల్లో నటించినప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. మునుపెన్నడూ ఇలాంటి భిన్నమైన పాత్రను పోషించలేదు. ఇది ఈ సిరీస్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇలాంటి ఓ గొప్ప కథతో ప్రేక్షకులను పలకరించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హర్కొనెస్‌ సిస్టర్స్‌ ఎలా పోరాడారనే కథాంశం ఆధారంగా దీన్ని రూపొందించారు.

ఇంకా చదవండి: బాలీవుడ్‌పై శ్రీలీల కన్ను!

# Dune     # Tabu     # EmilyWatson     # TravisFimmel