వరుస సినిమాలతో బిజీగా సూర్య!

వరుస సినిమాలతో బిజీగా సూర్య!

3 months ago | 17 Views

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'కంగువ' సినిమా చేస్తుండగా.. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కాగా మరోవైపు 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్‌ సుధా కొంగరతో 'సూర్య43'కి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రావాల్సి ఉంది. కాగా ఈ రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉండగానే తమిళ సూపర్‌ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజుతో సూర్య 44 సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు సూర్య. తాజాగా ఈ ఇంట్రెస్టింగ్‌ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది.


ఈ మూవీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అశోక్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు తక్కువ సమయంలోనే ఒకే అయింది. ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే షురూ కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను కార్తీక్‌ సుబ్బరాజు ఫైనల్ చేస్తారని చెప్పారు. అంతేకాదు తాజా టాక్‌ ప్రకారం సూర్య 44 మల్టీస్టారర్‌గా వచ్చే అవకాశాలున్నాయి. సినిమా స్లాట్‌ను కార్తీక్‌ సుబ్బరాజు ఇప్పటికే సిద్దం చేశాడట. ఈ చిత్రాన్ని 2025 పొంగల్  కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. సూర్య 44 ఏ జోనర్‌లో రాబోతుందనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం. సూర్య44 సినిమాను సూర్య హోంబ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే లాంఛ్‌ చేసిన 'కంగువ' గ్లింప్స్‌  వీడియో, పోస్టర్లు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. సూర్య, బాబీడియోల్‌ పోటీ పడి మరీ తమలోని కొత్త యాంగిల్‌ను పరిచయం చేయబోతున్నట్టు గూస్‌ బంప్స్‌ తెప్పించే యాక్షన్‌ సన్నివేశాలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

ఇంకా చదవండి: రికార్డ్‌ క్రియేట్‌ చేసిన 'కలియుగం పట్టణంలో’ ... విడుదలయిన ఒక్కరోజులోనే నిలుపుదల!

# Suriya     # Karthi     # Dhanush