సూర్య 'కంగువ'తో పోటీపడలేరు: నిర్మాత
4 months ago | 47 Views
శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'కంగువా’ రెండు భాగాలుగా ఇది రానుంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాపై అంచనాలను పెంచారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదే తేదీన మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ పోటీపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ మాట్లాడుతూ..'కంగువ’ కంటెంట్ గురించి తెలియదు కాబట్టి.. దీని మొదటి భాగం వచ్చే తేదీకి మరికొన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
కానీ, 'కంగువ2’తో మాత్రం ఎవ్వరూ పోటీకి రాలేరు. ఈ విషయాన్ని నమ్మకంతో చెబుతున్నాను. సినిమా కంటెంట్ అంత బలమైనది’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గతంలోనూ నిర్మాత సినిమా ఫలితంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రూ.1000 కోట్లు సాధించడమే లక్ష్యమన్నారు. సీక్వెల్‌కు కథ సిద్ధంగా ఉందన్నారు. పార్ట్ 1 విజయం ఆధారంగా సీక్వెల్ ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
ఇంకా చదవండి: మా రెమ్యూనరేషన్ కాదు..హీరోలను అడగండి
# Kanguva # Suriya # Film