ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోన్న సూర్య సన్నాఫ్ కృష్ణన్

ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోన్న సూర్య సన్నాఫ్ కృష్ణన్

1 month ago | 5 Views

సూర్య ద్విపాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. తమిళ్ లో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు.2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా తెలుగు అనువాద బ్యానర్ సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 


''సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటన చూపించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా ఈ మూవీ పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది.పివిఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఆ వీక్ లో తెలుగు నుంచి సూర్య సన్నాఫ్ కృష్ణన్ ను 12న ప్రదర్శించబోతున్నారు. ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపట్లోనే ఫుల్ అవుతోంది.13న మరో షో వేస్తున్నారు. అది కూడా ఫుల్ అవుతోంది. ప్రేక్షకులకు ఇది అంతటి ఇష్టమైన సినిమా ఇది. ఇక 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లోనూ విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలతో పాటు తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాము.టోటల్ గా 300లకు పైగా షోస్ ను ప్లాన్ చేశాం. యూత్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీని బూస్ట్ చేస్తోన్న పివిఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నాము. 12, 13 తేదీల్లో ప్రదర్శనలున్నా.. 14న చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాము. ఈ మూవీలోని 7 పాటలూ యూత్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పాలి. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం అని చెబుతున్నాను.." అన్నారు. 

నటీ నటులు  :
సూర్య
సిమ్రన్ 
రమ్య
దీపా నరేంద్రన్
బబ్లూ పృథ్వీ 
అవిషేక్ కార్తీక్
గౌతమ్ మీనన్

టెక్నీషియన్స్ :
సినిమాటోగ్రఫీ : ఆర్ రత్నవేలు
ఎడిటింగ్ : ఆంటోనీ
సంగీతం : హ్యారీస్ జయరాజ్ 
నిర్మాణ సంస్థ : ఆస్కార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్
తెలుగు నిర్మాత : సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్
దర్శకత్వం : గౌతమ్ వాసుదేవ్ మీనన్ 
పిఆర్వో : మధు వి.ఆర్
ఇంకా చదవండి: నవంబర్‌ నుంచి 'దేవర 2' షూటింగ్‌ ప్రారంభం
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సూర్య     # సమీరారెడ్డి