
ఏప్రిల్ 18న విడుదల కానున్న సుమయ రెడ్డి ‘డియర్ ఉమ’ చిత్రం
1 day ago | 5 Views
ఆడియన్స్ ప్రస్తుతం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల కంటే.. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పాయింట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియెన్స్ ముందుకు రానుంది. అలా మల్టీ టాలెంటెడ్ తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇందులో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.
ఇప్పటికే డియర్ ఉమ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చూడబోతోన్నామని ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ చెబుతోంది. మరి ఈ ప్రేమ కథను చూసే టైం వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతోన్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇక ఏప్రిల్ 18న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.
నటీనటులు : సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్, కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : సుమ చిత్ర ఆర్ట్స్
నిర్మాత : సుమయ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నితిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : నగేష్ యూ.జీ
దర్శకుడు : సాయి రాజేష్ మహాదేవ్
సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
సంగీతం : రధన్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : సాయి సతీష్
ఇంకా చదవండి: విడుదలైన నాలుగురోజుల్లోనే 200 కోట్లు వసూలు .. ఎంపరాన్ రికార్డు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# డియర్ ఉమ # సుమయ రెడ్డి # పృథ్వీ అంబర్ # ఏప్రిల్18