అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో స్టార్‌ హీరోల సినిమాలను దాటేసిన 'స్త్రీ-2'

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో స్టార్‌ హీరోల సినిమాలను దాటేసిన 'స్త్రీ-2'

4 months ago | 40 Views

రాజ్‌కుమార్‌ రావు, శ్రద్దా కపూర్‌ జంటగా అమర్‌కౌశిక్‌ తెరకెక్కించిన కామెడీ హారర్‌ చిత్రం 'స్త్రీ 2’ . ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హిందీలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో స్టార్‌ హీరోల సినిమాలను దాటేసింది. తాజాగా ’స్త్రీ 2’ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా.. బాలీవుడ్‌లో ’ఫైటర్‌’, ’కల్కి  2898 ఏడీ’ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌ల కలెక్షన్లను అది దాటేసింది. ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా వచ్చినట్లు చిత్రబృందం పేర్కొంది.

ఇదిలాగే కొనసాగితే.. తొలిరోజు కలెక్షన్లు కూడా ఈ సినిమాలను దాటేయడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్‌లో ఆగస్టు 15న విడుదల కానున్న చిత్రాలన్నిటి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కంటే 'స్త్రీ 2’కే ఎక్కువ రావడం విశేషం. 'స్త్రీ 2’ విషయానికొస్తే.. ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వుల్లో ముంచెత్తేవిధంగా  తెరకెక్కించారు. 2018లో వచ్చిన 'స్త్రీ’ మూవీకి ఇది సీక్వెల్‌. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్‌ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.  చిత్రబృందం అభిమానుల కోసం ఆగస్టు 14న ప్రత్యేక ప్రివ్యూ షోలను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది.


ఇంకా చదవండి: నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’ క‌లెక్ష‌న్స్‌ హ‌ల్ చ‌ల్ .. మూడు రోజుల్లో రూ.6.04 కోట్లు వ‌సూలు

# Stree2     # Bollywood     # August15    

trending

View More