రూ.58.62 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్ హీరో సూర్య 'కంగువ'
1 month ago | 5 Views
స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 58.62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నాయి. 'కంగువ'లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మెప్పించడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకునే దిశగా 'కంగువ' బాక్సాఫీస్ జర్నీ బిగిన్ చేసింది.
ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ
ఇంకా చదవండి: సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' స్పెల్‌బైండింగ్ ఫస్ట్ గ్లింప్స్