స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' రిలీజ్ ట్రైలర్ విడుదల
2 months ago | 5 Views
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. 'కంగువ' సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు 'కంగువ' రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.
'కంగువ' రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...వెయ్యిళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంగా, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలోని స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి, ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది ఆసక్తికరంగా చూపిస్తూ ట్రైలర్ సాగింది. ఒక వీరుడి ప్రతిజ్ఞ ఏంటి ?, అతన్ని మోసం చేసిందెవరు ?, ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా ?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది ? అనే అంశాలతో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'ధీర ధీర కదన విహార..ధీర.' పాట బీజీఎం "కంగువ" ట్రైలర్ ఇంటెన్సిటీ పెంచింది. "కంగువ" సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉండి ఆకట్టుకుంటోంది.
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ
ఇంకా చదవండి: అవకాశాల కోసం ఎదురుచూడ్డం కాదు మనమే అవకాశాలు సృష్టిoచుకోవాలి -రైజింగ్ స్టార్ రుషి కిరణ్