బాలీవుడ్‌పై శ్రీలీల కన్ను!

బాలీవుడ్‌పై శ్రీలీల కన్ను!

4 months ago | 40 Views

కథల ఎంపికలో జోరు చూపిస్తోంది అందాల తార శ్రీలీల. ఇప్పటికే 'భగవంత్‌ కేసరి’, 'గుంటూరు కారం’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. బాలీవుడ్‌ కథానాయకుడు సిద్దార్థ్‌ మల్హోత్రా 'మిట్టి’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. బల్వీందర్‌ సింగ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.


ఇప్పుడీ సినిమాలో కథానాయికగా శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. ‘'కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ కథ విన్న వెంటనే సిద్దార్థ్‌ సరసన నటించడానికి అంగీకారం తెలిపింది శ్రీలీల. ఈ చిత్రంతో తన బాలీవుడ్‌ ప్రయాణం ప్రారంభం కాబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉందీమె. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 'రాబిన్‌హుడ్‌’, 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల.

ఇంకా చదవండి: మరోసారి అనిల్‌ రావిపూడితో వెంకటేశ్‌

# Mitti     # Sreeleela     # SidharthMalhotra    

trending

View More