స్పై యాక్షన్‌ సిరీస్‌ 'సిటాడెల్‌’..  నటి సమంత పోస్టర్‌ విడుదల

స్పై యాక్షన్‌ సిరీస్‌ 'సిటాడెల్‌’.. నటి సమంత పోస్టర్‌ విడుదల

5 months ago | 25 Views

'ది ఫ్యామిలీ మ్యాన్‌’, 'ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్న మరో స్పై యాక్షన్‌ సిరీస్‌ 'సిటాడెల్‌’. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి 'సిటాడెల్‌: హనీ బన్నీ’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహించిన ప్రైమ్‌ వీడియో ప్రెజెంట్స్‌ కార్యక్రమంలో ఈ వివరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ...'నేనింతగా యాక్షన్‌ చేస్తానని ఏనాడూ ఊహించలేదు. కనీసం ఇందులో భాగమవుతానని చివరిక్షణం వరకూ అనుకోలేదు. ఈ  సిరీస్‌ కోసం శారీరకంగా ఎంతో శ్రమించా.

రాజ్‌, డీకే చాలా ప్రతిభావంతులు. అమెరికన్‌ 'సిటాడెల్‌’ని భారతీయ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. 'ఇదొక అద్భుతమైన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులోని సన్నివేశాలు, ప్రేమకథ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి’ అని తెలిపింది సిరీస్‌ బృందం. కే కే మేనన్‌, సిమ్రాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ ప్రాజెక్టు అమెజాన్‌ ప్రైమ్‌లో త్వరలో విడుదల కానుంది.

ఇంకా చదవండి: రామ్‌చరణ్‌ 'ఆర్‌సి-16' మొదలయింది...

# Citadel India     # Samantha Ruth Prabhu     # Varun Dhawan    

trending

View More