'రామాయణం' కోసం ప్రత్యేక శ్రద్ద... బంగారు ఆభరణాలనే ఉపయోగించబోతున్న టీమ్‌!

'రామాయణం' కోసం ప్రత్యేక శ్రద్ద... బంగారు ఆభరణాలనే ఉపయోగించబోతున్న టీమ్‌!

1 month ago | 18 Views

భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్‌ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ’. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే! భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దీంట్లో రావణుడి పాత్రధారి ధరించనున్న దుస్తులు, ఆభరణాలు వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం. ఎందుకంటే రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి.

Bollywood Sitting On A Potential Jackpot?

ఆయన ధరించిన వస్త్రాలు  కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో చెప్పారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో యశ్‌ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇంకా చదవండి: ఆర్కా మీడియా నిర్మాణంలో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ "యక్షిణి" అనౌన్స్ చేసిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్

# Ramayana     # RanbirKapoor     # SaiPallavi     # TeluguCinema