'దేవర -2'లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్!?
2 months ago | 5 Views
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవర’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దీని సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవర2’ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సీక్వెల్‌లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు. ఇది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. 'దేవర2’లో రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది జరుగుతుందో, లేదో తెలియకుండా నేను ఎక్కువ వివరాలు పంచుకోకూడదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల పేర్లు చెబితే ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలవుతాయి.
'దేవర-2’లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. అవి సినిమాలో చాలా కీలకమైనవి. అతి త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తాను అని కొరటాల శివ అన్నారు. ’దేవర 2’పై కొరటాల ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేస్తున్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇటీవల వెల్లడించారు. పార్ట్ 1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారన్నారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుందని చెప్పారు .ఎన్టీఆర్ కూడా ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. మొదటి భాగం విజయం సాధించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. 'దేవర’ కంటే దాని సీక్వెల్ ఇంకా బాగుంటుందన్నారు.
ఇంకా చదవండి: 'స్వయంభూ' సెట్‌లో.. ఆయుధపూజ!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !