'పుష్ప 2' షూటింగ్‌లో తగ్గిన వేగం.. విడుదల ఆలస్యం తప్పదని టాక్‌!

'పుష్ప 2' షూటింగ్‌లో తగ్గిన వేగం.. విడుదల ఆలస్యం తప్పదని టాక్‌!

13 days ago | 18 Views

ఐకాన్‌ స్టార్‌ గా అభిమానులు పిలుచుకునే అల్లు అర్జున్‌  'పుష్ప 2'చిత్రీకరణలో బిజీగా వున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే   'పుష్ప 2' సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది అని ఇప్పటివరకు ఘంటాపథంగా చెప్పుకువస్తున్న చిత్ర నిర్వాహకులు ఇప్పుడు ఆ సినిమా ఆ తేదీకి రావటం లేదని అంటున్నట్టుగా పరిశ్రమలో ఒక టాక్‌ నడుస్తోంది. ఇంకా చిత్రీకరణ చెయ్యాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయని, అవి కాకుండా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పని కోసం సుకుమార్‌ చాలా సమయం అడిగారని కూడా తెలుస్తోంది. అయితే చిత్ర నిర్మాతలు సుకుమార్‌ పై చాలా ఒత్తిడి తెచ్చి ఎలా అయినా ఆగస్ట్‌ 15న విడుదల చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఒత్తిడితో పని చెయ్యడం చాలా కష్టమని, తనకి తగినంత సమయం ఇవ్వాలని, అందుకని ఆగస్టు 15వ తేదీకి సినిమా రావటం కూడా కష్టమని దర్శకుడు నిర్మాతలతో చెప్పినట్టుగా వార్తలు పరిశ్రమలో నడుస్తున్నాయి.

ఇప్పుడు చిత్ర నిర్మాతలు కొత్త తేదీ కోసం వెతుకులాట ప్రారంభించారని కూడా తెలిసింది. అయితే దగ్గరలో వాళ్ళకి ఎటువంటి తేదీలు కనపడలేదని, ఎందుకంటే వేరే పెద్ద సినిమాలు ఆ సమయంలో విడుదలకు ఉన్నాయని, అందువలన ఏకంగా డిసెంబర్‌ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నటుగా తెలిసింది. ఒకవేళ  'పుష్ప 2' డిసెంబర్‌ నెలలో విడుదలైతే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందా అని కూడా చిత్ర నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా కూడా  'పుష్ప 2' విడుదల వాయిదా పడటం మాత్రం ఖాయం అని పరిశ్రమలో అంటున్నారు. అందువలనే ఎన్టీఆర్‌, శివ కొరటాల కాంబినేషన్‌ లో వస్తున్న 'దేవర’ విడుదల ముందుకు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు, రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది.

ఇంకా చదవండి: మళ్లీ షూటింగ్‌లకు రెడీ అవుతున్న బాలయ్య

# Pushpa2TheRule     # AlluArjun     # RashmikaMandanna     # TeluguCinema    

trending

View More