నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన శివకార్తికేయన్, సాయిపల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, 'అమరన్' గ్రిప్పింగ్ ట్రైలర్
1 month ago | 5 Views
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ట్రైలర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పరిచయం చేస్తుంది. మేజర్ ముకుంద్, అతని కుమార్తె హార్ట్ టచ్చింగ్ ఫుటేజ్‌తో ట్రైలర్ ప్రారంభమైయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్, అతని భార్యగా సాయిపల్లవి, ఆన్-స్క్రీన్ డాటర్ క్యారెక్టర్స్ లోకి ట్రైలర్ నేచురల్ గా ట్రాన్స్ ఫర్మేన్షన్ అవ్వడం కట్టిపడేసింది.
తన దేశానికి సేవ చేయడంలో మేజర్ ముకుంద్ నిబద్ధత గూస్ బంప్స్ తెప్పించింది. ట్రెయిలర్ లో ధైర్యం, త్యాగం థీమ్స్ తో పాటు మేజర్ ముకుంద్ సైనిక జీవితం, ఫ్యామిలీ బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
'అమరన్' మేజర్ ముకుంద్ చేసిన త్యాగాలకు గొప్ప ట్రిబ్యూట్ గా వుంటుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. శివకార్తికేయన్ బ్రిలియంట్ పెర్ఫర్మెన్స్ ఇచ్చారు. క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. సాయిపల్లవి తన పాత్రలో అద్భుతంగా నటించింది.
సిహెచ్ సాయి అందించిన విజువల్స్ అద్భుతంగా వున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ బీజీఎం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. రాజ్‌కుమార్ పెరియసామి దేశభక్తి, కుటుంబ భావోద్వేగాలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా వున్నాయి. పవర్ ఫుల్ నెరేటివ్, ఎమోషనల్ డెప్త్‌తో ట్రైలర్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది.
నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
ఇంకా చదవండి: 'లక్కీ భాస్కర్'గా వస్తున్న దుల్కర్ సల్మాన్!