"జార్జ్ రెడ్డి" ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి అందించిన కథతో యదార్థ ఘటనల నేపథ్యంగా తెరకెక్కనున్న “సింగరేణి జంగ్ సైరెన్” మూవీ

5 months ago | 38 Views

జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ధూమ్ర వారాహి బ్యానర్ పై నూతన దర్శకుడు వివేక్ ఇనుగుర్తి  రూపొందించనున్నారు. 1999 లో సింగరేణిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

ఈ సర్వైవల్ డ్రామా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే రోజున ప్రకటించనున్నారు. తెలంగాణ నేపథ్య సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న ఈ టైమ్ లో పక్కా తెలంగాణ నేటివ్ మూవీగా “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాను పిక్చరైజ్ చేయనున్నారు.

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - ప్రసన్న దంతులూరి

అసొసియేట్ రైటర్: లాటి ఫ్లింకారీ

ఎడిటింగ్ - హరీశ్ మధురెడ్డి

సినిమాటోగ్రఫీ - రాకీ వనమాలి

స్టిల్స్ : సేగు వికాస్

వీఎఫ్ఎక్స్ - మధు అర్జ్

మ్యూజిక్- సురేష్ బొబ్బిలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - లలన్ మహేంద్ర, టి. మురళి రఘువరన్

పీఆర్ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కథ - జీవన్ రెడ్డి

దర్శకత్వం - వివేక్ ఇనుగుర్తి

ఇంకా చదవండి: 'శబరి' తర్వాత మనం మరో సినిమా చేద్దామని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు : నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఇంటర్వ్యూ

# Singarenijungsiren     # Georgereddy     # Tollywood    

trending

View More