థగ్‌  లైఫ్‌ చేరిన శింబు!

థగ్‌ లైఫ్‌ చేరిన శింబు!

6 months ago | 26 Views

కమల్‌ హాసన్‌  నటిస్తున్న సినిమాల్లో ఒకటి 'థగ్‌ లైఫ్‌’ . మణిరత్నం దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్టార్‌ యాక్టర్‌ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాడు. స్టార్‌ హీరో శింబును మేకర్స్‌ థగ్‌ లైఫ్‌ టీంలోకి స్వాగతం పలికారు. ఈ మూవీ నుంచి మాలీవుడ్‌ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తప్పుకున్నాడని తెలిసిందే. దుల్కర్‌ స్థానంలో శింబును రీప్లేస్‌ చేసినట్టు సమాచారం. శింబు పోర్షన్లు ఏప్రిల్‌ నుంచి షూట్‌ చేయనుండగా.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. తాజా టాక్‌ ప్రకారం 2024 సెకండాఫ్‌లో షురూ అవనుంది. ఈలోగా శింబు థగ్‌ లైఫ్‌ను పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది.

థగ్‌ లైఫ్‌ టీంతో మేకర్స్‌ డిజైన్‌ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. థగ్‌ లైఫ్‌ చిత్రాన్ని కమల్‌ హాసన్‌`ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్‌ జియాంట్‌ మూవీస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని కమల్‌ హాసన్‌ సమర్పణలో హోంబ్యానర్‌ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌పై కమల్‌ హాసన్‌ ఆర్‌ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కమల్‌ హాసన్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న 'కల్కి 2898 ఏడీ'లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇంకా చదవండి: ‘కలియుగం పట్టణంలో’ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం : హీరో విశ్వ కార్తికేయ

# Thug Life     # Kamal Haasan     # Mani Ratnam    

trending

View More