'డెకాయిట్‌' సినిమా షూటింగ్‌లో  జాయిన్‌ అయిన శృతి

'డెకాయిట్‌' సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయిన శృతి

18 days ago | 9 Views

అడివి శేష్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న మెగా పాన్‌ఇండియా యాక్షన్‌ డ్రామా 'డెకాయిట్‌' సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోకి హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్‌ జాయిన్‌ అయింది. ఈ మ్యాసీవ్‌ యాక్షన్‌ షెడ్యూల్‌లో లీడ్‌ కాస్ట్‌పై కీలకమైన సన్నివేశాలను, యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. టీమ్‌తో జాయిన్‌ అయిన సందర్భంగా శృతి హాసన్‌, శేష్‌తో సెల్ఫీని షేర్‌ చేశారు. 'డెకాయిట్‌' ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్‌ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్‌'క్షణం’, 'గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్‌ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

శేష్‌, శృతి జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ సినిమాను ప్రజెంట్‌ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అడివి శేష్‌, షానీల్‌ డియో కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన 'మేజర్‌’ తర్వాత శేష్‌ సెకెండ్‌ స్టయ్రిట్‌ హిందీ మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్‌ తెలియజేయనున్నారు.

ఇంకా చదవండి: 'పుష్పా2' షూటింగ్‌లో తగ్గిన వేగం.. విడుదల ఆలస్యం తప్పదని టాక్‌!

# Dacoit     # Adivisesh     # Shrutihaasan     # TeluguCinema