కేరళలో విజయ్ దేవరకొండ చిత్రం షూటింగ్ పూర్తి!
2 months ago | 5 Views
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం 'వీడీ 12’ ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కేరళలో ఓ షెడ్యూల్ పూర్తయింది. దీనిని ఉద్దేశించి విజయ్ ఫ్యాన్స్ విూట్‌లో మాట్లాడారు. ప్రకృతి అందాల మధ్య షూట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేరళలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు. ఇది అందరి మనసులకు దగ్గరవుతుందని.. మంచి జ్ఞాపకాల్నిస్తుందన్నారు.'వీడీ 12’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ కాగా.. నిర్మాణ సంస్థ స్పందించింది. 'డియర్ రౌడీ ఫ్యాన్స్.. విూకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టీమ్ ఎంతో కష్టపడుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.
లీక్ అయిన ఫొటోను షేర్ చేయొద్దు'' అని విజ్ఞప్తి చేసింది. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని నిర్మాత ఓ సందర్భంలో చెప్పారు. వచ్చే ఏడాది మార్చి28న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 'విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అంటూ టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేరళలో విజయ్ ఫ్యాన్స్ విూట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి.
ఇంకా చదవండి: 'రోలెక్స్' పాత్ర ఆధారంగా సినిమా : హీరో సూర్య ఆసక్తికర విషయం వెల్లడి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!