ఓటిటిలోకి వచ్చేసిన 'శివంగి'
17 days ago | 5 Views
యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్కీన్ర్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో భాగంగా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీ అనూహ్యంగా అప్పుడే ఓటీటీలోకి వచ్చింది.
'శివంగి’ మూవీ గురువారం నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ’ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ విూడియా వేదికగా ఆహా ఓటీటీ- సంస్థ వెల్లడించింది. అలాగే 'ఒకరోజు. జీవితాంతం పోరాటం. సత్యభామ కథ మిమ్మల్ని ప్రతిదానికి ప్రశ్నించేలా చేస్తుంది. అది హత్యా లేక ఆత్మహత్యా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇంకా చదవండి: ఓదెలకు సీక్వెల్‌గా 'ఓదెల-2' మూవీ.. అరంధతి, అఖండల కలయికలా సాగినకథ!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!