'ఆనందోబ్రహ్మ'కు సీక్వెల్‌!

'ఆనందోబ్రహ్మ'కు సీక్వెల్‌!

4 months ago | 44 Views

 తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్‌కు, ఫ్రాంఛైజీలకు మంచి సీజన్‌ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ సెట్స్‌ విూద వున్నాయి. ఇందులో ఈ భాగంగానే తాప్సీ కథానాయికగా నటించిన విజయవంతమైన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ 'ఆనందో బ్రహ్మా'కు సీక్వెల్‌ రాబోతుంది. ఇంతకు ముందు 'ఆనందో బ్రహ్మా' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాత మహి.వి.రాఘవ ఈ సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం 'ఆనందో బ్రహ్మ'కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ మొదలయ్యాయి. అయితే ఈ చిత్రం మొదటిభాగంలో నటించిన కథానాయిక తాప్సీని ఒప్పించే పనిలో వున్నాడు మహి.  ఈ సీక్వెల్‌ కోసం ఆమెను సంప్రదించి ఒప్పించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమాలో ఓ యంగ్‌హీరో కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో వున్నారు దర్శక నిర్మాతలు. 'ఆనందో బ్రహ్మా'ను తమిళంలో పెట్రోమాక్స్‌గా రిమేక్‌ చేయగా.. ఇందులో తమన్నా కథానాయికగా నటించింది.

ఇంకా చదవండి: మరోమారు ఓటిటిలోకి నయనతార 'అన్నపూరణి'!

# AnandoBrahma     # TaapseePannu     # SrinivasReddy    

trending

View More