"మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

8 hours ago | 5 Views

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" కంటెంట్ ఉన్న మంచి కమర్షియల్ మూవీ. ఈ చిత్రంతో మాధవ్, సిమ్రాన్ పరిచయం అవుతున్నా, వాళ్ల నటన ఎక్కడా కొత్తవాళ్లు చేసినట్లు అనిపించదు. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గౌరి గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి థ్యాంక్స్. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే థియేటర్స్ లో చూడండి. అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత రవిచంద్ నా మిత్రుడు. గతంలో హ్యాష్ ట్యాగ్ బ్రో అనే సినిమా చేశాడు. అది ఓటీటీలో రిలీజైంది. మరో సినిమా చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతోనే సినిమా నిర్మించాలని ప్లాన్ చేశాడు. పెళ్లి సందడి సినిమా వంటి చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసిన గౌరీ గారి దగ్గర ఉన్న స్క్రిప్ట్ నచ్చి "మిస్టర్ ఇడియ‌ట్‌" ప్రారంభించాడు. ఈ సినిమాలో మాధవ్, సిమ్రాన్ పోటా పోటీగా మూవీ చివరి దాకా నటించారు. వాళ్లు ఎక్కడా కొత్త యాక్టర్స్ అనిపించదు. మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. సినిమా డెఫనెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. గౌరీ గారు వండర్ ఫుల్ డైరెక్టర్. మాధవ్, సిమ్రాన్ ఈ చిత్రంతో తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా వారితో పాటు మా టీమ్ అందరికీ బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" తో ఒక మంచి సినిమా చేశాం. డైరెక్టర్ గౌరీ రోణంకి గారు అందరికీ నచ్చేలా మూవీ రూపొందించారు. అనూప్ గారు ఇచ్చిన మ్యూజిక్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి, ఎడిటర్ విప్లవ్ మా ఇతర టీమ్ అంతా మూవీకి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చారు. నా ఫ్రెండ్ వేణుగోపాల్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు పిలవగానే మా ఈవెంట్ కు వచ్చినందుకు థ్యాంక్స్. మాధవ్ నటనలో వారి పెదనాన్న ఫీచర్స్ కొన్ని వచ్చాయి. మా సినిమాలో అది చూస్తారు. అతను కొత్త హీరోలా అనిపించడు. అలాగే హీరోయిన్ సిమ్రాన్ నటనతో ఆకట్టుకుంటుంది. "మిస్టర్ ఇడియ‌ట్‌" తో ఎలాంటి క్వాలిటీ సినిమా చేశామనేది మీరు త్వరలో థియేటర్స్ లో చూస్తారు. అని అన్నారు.

డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ గారికి సినిమా ప్రారంభంలోనే చెప్పాను. మీ మ్యూజిక్ తో సినిమా హిట్టై పోవాలని. ఆయన మా కథను అర్థం చేసుకుని మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్, డ్యాన్స్ విషయాల్లో నాకు ఎక్కువగా తెలియదు. కానీ నేను చెప్పిన సజెషన్స్ తీసుకుంటూనే వాళ్లంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి థ్యాంక్స్. మాధవ్, సిమ్రాన్ గురించి చాలా చెప్పాలి. ఈ మూవీలో వాళ్ల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యే అంశాలతో మూవీ రూపొందించాను. త్వరలోనే "మిస్టర్ ఇడియ‌ట్‌"  థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా మీ బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో మాధవ్ మాట్లాడుతూ - ఫస్ట్ టైమ్ మీడియా ముందు మాట్లాడుతున్నా. "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి థ్యాంక్స్. అలాగే నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. మా సినిమాను మీ ముందుకు తీసుకురావడంలో కొద్దిగా లేట్ అయ్యింది. మేము శాటిస్వై అయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దని భావించాం. అందుకే కొంత లేట్ అయినా పర్పెక్ట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశాం. మీ అందరికీ "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నా. అనూప్ గారి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. అలాగే రామ్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ గౌరి గారు నాకు ఒక మంచి మూవీ ఇస్తున్నారు. నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్. మా పెదనాన్న రవితేజ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. "మిస్టర్ ఇడియ‌ట్‌"  సినిమా నవంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ - "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ రిలీజ్ లో బాగా మాట్లాడేందుకు ప్రిపేర్ అయ్యా. కానీ మీ అందరి ఎనర్జీ చూశాక మాటలన్నీ మర్చిపోయా. ట్రైలర్ రిలీజ్ కు వచ్చినదానికంటే వెయ్యింతల ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాలో వర్క్ చేయడం బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. డైరెక్టర్ గౌరీ ఒక ఫ్రెండ్ లా ఎంకరేజ్ చేసింది. అలాగే మాధవ్ ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. తనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నవంబర్ లో మా మూవీ రిలీజ్ కు వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

అతిథిగా వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ - రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. నన్ను కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఈ ఫంక్షన్ కు పిలిచినప్పుడు మాధవ్ ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించి వచ్చాను. నేనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది మాధవ్ ను సపోర్ట్ చేస్తారు. సీసీఎల్ కు వెళ్లినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించారు. అది "మిస్టర్ ఇడియ‌ట్‌" లో మాధవ్ చేసిన సాంగ్. చాలా బాగుంది ఎవరు హీరో అని అడిగితే మా అబ్బాయి అని చెప్పారు. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. ఆ సినిమాలో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మాధవ్ సినిమాకు మిస్టర్ ఇడియట్ అనే పేరు పెట్టడం బాగుంది. చాలా ఎనర్జిటిక్ గా నటించాడు మాధవ్. రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నా. మా సినిమా బాగుందని అనుకోవడం వేరు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేసుకున్నాం అని చెప్పడం గొప్ప విషయం. ఈ టీమ్ అలాంటి కరెక్షన్స్ చేసుకుంది అంటే సక్సెస్ అందుకున్నట్లే అనిపిస్తోంది. నవంబర్ లో రిలీజ్ అవుతున్న "మిస్టర్ ఇడియ‌ట్‌"  సినిమాను అందరూ చూడండి. డైరెక్టర్ గౌరి గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్  గారికి ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు - మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌, తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ - శ్యామ్, వంశీ

సంగీతం అనూప్ రూబెన్స్

లిరిక్స్ - శివశక్తి దత్తా, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్

కొరియోగ్రఫీ - భాను, జిత్తు, వెంకట్, పృథ్వీ

స్టంట్స్ - రాజేశ్ లంక

సినిమాటోగ్రఫీ - రామ్ రెడ్డి

ఆర్ట్ - కిరణ్ కుమార్ మన్నె

ఎడిటింగ్ - విప్లవ్ నైషధం

పీఆర్వో - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాత - జేజేఆర్ రవిచంద్

రచన, దర్శకత్వం - గౌరి రోణంకి

ఇంకా చదవండి: ఘనంగా "బహిర్భూమి" ప్రీ రిలీజ్ ఈవెంట్, అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Mr.Idiot     # Maadhav     # Simransharma    

trending

View More