సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'రక్షణ' ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'రక్షణ' ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

1 month ago | 23 Views

సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో,  ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీలో "భవానీ మీడియా " డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఈ చిత్రంలో  పాయల్‌ రాజ్‌పుత్‌ "లేడి సింగం" గా అదరగొట్టింది. కథ, కథనం, పెర్ఫార్మెన్స్ లు ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా వుంటాయి. 

మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. 

ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి "ఆహా" లో "రక్షణ" మూవీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా చదవండి: ఓదెల సినిమా కోసం బోనం ఎత్తిన తమన్నా

# Rakshana     # PayalRajput     # OTT    

trending

View More