'తంగలాన్‌' నుంచి భయపెట్టే ట్రైలర్‌

'తంగలాన్‌' నుంచి భయపెట్టే ట్రైలర్‌

2 days ago | 10 Views

చియాన్‌ విక్రమ్‌, పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ’తంగలాన్‌’ చిత్రం నుంచి త్వరలోనే ప్రతి ఒక్కరినీ  భయపెట్టే అద్భుతమైన ట్రైలర్‌ రాబోతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తయిందని ఆయన వెల్లడించారు.  ఈ మేరకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ తన ఎక్స్‌ హ్యాండిల్‌లో రీసెంట్‌గా ఓ ట్వీట్‌ చేశారు. 'తంగలాన్‌’ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కంపోజింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు నా బెస్ట్‌ ఎఫర్ట్‌ చేశాను. ఈ అద్భుతమైన చిత్రం కోసం ఎదురు చూస్తున్నా.

Get Ready For Vikram Thangalaan Release Update | cinejosh.com

ప్రేక్షకులను విస్మయానికి గురిచేసే భయంకరమైన, అద్భుతమైన ట్రైలర్‌ త్వరలోనే విడుదల కానుంది. భారతీయ చిత్రపరిశ్రమ ఈ సినిమా కోసం అమితాసక్తితో ఎదురు చూస్తుంది’ అని జీవీ ప్రకాష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌, మాళవిక మోహనన్‌ , పశుపతి తదితరులు నటించారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ ఫిల్మ్‌గా ఈ సినిమాను దర్శకుడు పా.రంజిత్‌ రూపొందించారు. చాలాకాలం క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్నప్పటికీ పలు కారణాల వల్ల సినిమా విడుదలలో జాప్యం నెలకొంది. చివరకు ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ఎª`లాన్‌ చేశారు.

ఇంకా చదవండి: వెట్రిమారన్‌ సినిమాలో రుహానీ శర్మ!

# Thangalaan     # Vikram     # MalavikaMohanan     # TeluguCinema