దసరా బరిలో

దసరా బరిలో "బరాబర్ ప్రేమిస్తా" అంటూ

3 months ago | 41 Views

Cc క్రియేషన్స్  పతాకంపై చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు  సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్' బరాబర్ ప్రేమిస్తా'. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ"బరాబర్ ప్రేమిస్తా" చిత్రం ప్యూర్ విలేజ్ లవ్ అండ్  యాక్షన్ ఎంటర్ టైనర్  గా నిలుస్తుంది. మా హీరో చంద్రహాస, మేఘనా ముఖర్జీ యూత్ ని ఆకట్టుకునే లవర్స్ గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి  చేసుకుంటూ దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తు న్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము.  

చంద్రహాస్ ,మేఘనముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్,  రాజశేఖర్ అనింగి , మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న

ఈ చిత్రానికి స్టోరీ: తిరుపతి ఎంఏ, స్క్రీన్ ప్లే: సంపత్. వి . రుద్ర, తిరుపతి,డైలాగ్స్: రమేష్ రాయ్,  లిరిక్స్ :సురేష్ గంగుల, ఆర్ట్ :  బి .జగన్, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, డిఓపి:వై .ఆర్ శేఖర్, మ్యూజిక్ :ఆర్ .ఆర్. దృవన్, పి ఆర్ ఓ: బి .వీరబాబు, నిర్మాతలు: గెడా చందు, గాయత్రీ చిన్ని , వెంకటేశ్వరరావు ,దర్శకత్వం: సంపత్. వి. రుద్ర

ఇంకా చదవండి: ‘సత్య’ సినిమా స్ట్రీమింగ్‌ ‘ఆహా’ ఓటిటిలో...

# BaraabarPremistha     # ArjunMahi     # MuralidharGoud    

trending

View More