'సత్యంసుదందరం' విజయాన్ని అందుకోవాలి...  చిత్రం విడుదల సందర్భంగా సాయిదుర్గా తేజ్‌ పోస్ట్‌

'సత్యంసుదందరం' విజయాన్ని అందుకోవాలి... చిత్రం విడుదల సందర్భంగా సాయిదుర్గా తేజ్‌ పోస్ట్‌

2 months ago | 5 Views

కార్తి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్‌’ . ఈ సినిమా విడుదలను ఉద్దేశించి తాజాగా సాయిదుర్గా తేజ్‌  కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్‌’ . ’సత్యం సుందరం’ పేరుతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సాయిదుర్గా తేజ్‌  పోస్ట్‌ పెట్టారు.


ఈ సినిమా ఘన విజయాన్ని అందు కోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన చిత్రం 'సత్యం సుందరం’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మనసుని హత్తుకునే చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌,  కార్తి అన్న కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరవిందస్వామి, సూర్య, జ్యోతికతోపాటు చిత్రబృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీనిపై కార్తి స్పందించారు. బ్రదర్‌.. ప్రేమ, ఆప్యాయతతో విూరు ఎల్లప్పుడూ మంచి మనసు చాటుకుంటారు. విూ విషెస్‌కు ధన్యవాదాలు‘ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అనుకోకుండా ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్న 'సత్యం, సుందరం' అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథగా సి.ప్రేమ్‌ కుమార్‌ దీనిని తీర్చిదిద్దారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు నిర్మించారు. ఎలాంటి కమర్షియల్‌ హంగులు, యాక్షన్‌ సన్నివేశాలు లేకుండా మనసుని హత్తుకునే కథగా దీనిని రూపొందించినట్లు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. ఈ సినిమా తప్పకుండా విజయం అందుకుంటుందని సూర్య చెప్పారని ఇటీవల కార్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇంకా చదవండి: ఓటీటీ లోకి రానున్న "సరిపోదా శనివారం"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# SatyamSundaram     # Karthi     # ArvindSwami     # SaidharamTej     # September28    

trending

View More