‘సత్య’ సినిమా స్ట్రీమింగ్‌ ‘ఆహా’ ఓటీటీలో...

‘సత్య’ సినిమా స్ట్రీమింగ్‌ ‘ఆహా’ ఓటీటీలో...

3 months ago | 48 Views

హమరేశ్, ప్రార్ధనా సందీప్‌ జంటగా నటించిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’.  వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడు. శివమ్‌ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా మారి తమిళ చిత్రం ‘రంగోలి’ ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్‌ తండ్రిపాత్రలో ఎంతో గొప్పగా నటించారు.  సినిమా చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. గవర్నమెంట్‌ కాలెజి కంటే ప్రవేట్‌ కాలేజి అయితే మంచి అలవాట్లు చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ చిత్రం ఎమోషనల్‌ హిట్‌గా నిలిచింది.


అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రవేట్‌ స్కూల్స్, కాలేజిల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’ . వినాయకచవితి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు తమ జీవితాల్లోని స్కూల్, కాలెజీ , టీనేజ్‌ లవ్‌ని మరోసారి మీరంతా గుర్తు తెచ్చుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం అంటున్నారు చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని సుందరమూర్తి అందించగా మాటలను కె.యన్‌ విజయ్‌కుమార్‌ అందించారు. పాటలు– రాంబాబు గోసాలపి.ఆర్‌.వో– వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల.

ఇంకా చదవండి: ఆకట్టుకుంటున్న ‘మంగంపేట’ ఫస్ట్ లుక్.. విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్

# Satya     # Prarthanasandeep     # Aha    

trending

View More