'సరిపోదా శనివారం' 29న విడుదల.. సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన

'సరిపోదా శనివారం' 29న విడుదల.. సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన

3 months ago | 42 Views

నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం’ .. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా మూవీ ప్రమోషన్స్‌ చేస్తుంది.


అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్నట్లు నాని సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా వదిలాడు.'సరిపోదా శనివారం’ సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ బోర్డ్‌ యు /ఏ  సర్టీఫికెట్‌ ఇచ్చింది. అలాగే 2 గంటల 35 నిమిషాలు రన్‌ టైం అని నాని చెప్పగా.. వెనక నుంచి ఎస్‌జే సూర్య వచ్చి ప్లస్‌ 15 మినిట్స్‌ అంటాడు. మొత్తం 2 గంటల 50 నిమిషాలు అంటే సుందరానికి కూడా ఇదే రన్‌ టైం కదా అంటూ ఎస్‌జే సూర్య అనగా.. అంటే కాదు..'సరిపోదా శనివారం’ అంటూ నాని అనడం ఇది ఒక యాక్షన్‌ మూవీ అండ్‌ లవ్‌ స్టోరీ అంటూ వీడియోను వదిలారు.

ఇంకా చదవండి: శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ -1 "రాజా మార్కండేయ" టైటిల్ లోగో విడుదల!!

# SaripodaaSanivaaram     # Nani     # PriyankaMohan     # SJSurya    

trending

View More