విడుదలకు  'సరిపోదా శనివారం' సిద్ధం

విడుదలకు 'సరిపోదా శనివారం' సిద్ధం

4 months ago | 42 Views

టాలీవుడ్‌ హీరో  నాని నటించిన  తాజా చిత్రం 'సరిపోదా శనివారం’కు  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. 'గ్యాంగ్‌లీడర్‌' ఫేం ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 29న విడుదల చేస్తున్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా ట్రైలర్‌ టైంను గుర్తు చేస్తూ నాని హంగామా షురూ అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో నయా లుక్‌ ఒకటి షేర్‌ చేసింది.


ఈ లుక్‌ చూసిన అభిమానులు ట్రైలర్‌ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని తెగ ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆఫీసులో నాని.. డ్యూటీ లో ప్రియాంకా మోహన్‌ చాట్‌లో ఉన్న స్టిల్స్‌ షేర్‌ చేశారని తెలిసిందే.. యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ ఇతర భాషల్లోనూ  రిలీజ్‌ కానుంది.

ఇంకా చదవండి: అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌తో మండే టెస్ట్ పాస్ అయిన నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’

# Saripodhaasanivaaram     # Nani     # Priyanka     # Sjsuryah     # August29    

trending

View More