బెల్లంకొండ సినిమాలో సంయుక్త!

బెల్లంకొండ సినిమాలో సంయుక్త!

7 days ago | 12 Views

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌  బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో బిఎస్‌ఎస్‌12ను  ఈ ఏడాది జులైలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో భీమ్లానాయక్‌ ఫేం సంయుక్త ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సంయుక్త  పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పాత్రకు సంబంధించిన స్టయిలిష్  ట్రెండీ లుక్‌ విడుదల చేశారు.

సంయుక్త  ఇందులో సవిూర పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే టీం క్లారిటీ రానుంది. ఈ మూవీకి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నాడు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. సంయుక్త  శర్వానంద్‌ 37లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోండగా.. దియా లుక్‌ ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇంకా చదవండి: బెంగళూరులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న "గీతా శంకరం"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Bellamkondasaisrinivas     # Samyukta     # Tollywoodcinema    

trending

View More