'అఖండ-2'లో  విలన్‌గా సంజయ్‌దత్‌ ?

'అఖండ-2'లో విలన్‌గా సంజయ్‌దత్‌ ?

25 days ago | 14 Views

'అఖండ 2’ స్క్రిప్ట్‌ పనుల్లో బోయపాటి బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా కథ పూర్తి శైవత్వం నేపథ్యంలో సాగుతుందని విశ్వసనీయ వర్గాల భోగట్ట. ఇందులో విలన్‌ పాత్ర అత్యంత శక్తిమంతంగా రాసుకున్నారట బోయపాటి. ఆ పాత్రకోసం బాబీడియోల్‌, సంజయ్‌దత్‌లను కూడా కలిశారట. అయితే.. సంజయ్‌దత్‌ దాదాపు ఖరారైనట్టు సమాచారం. దక్షిణభారత దేశంలో శైవం ఎంత బలీయంగా ఉంటుందో, ఇక్కడి ఆలయాల ప్రాచుర్యం, వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఈ కథలో వివరించనున్నారట బోయపాటి.  బాలయ్య, సంజయ్‌దత్‌ల పాత్రల్ని నువ్వానేనా అనేలా డిజైన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయ్యాక. బోయపాటి సినిమా ఉంటుందని తెలుస్తున్నది.

Akhanda 2: 'అఖండ 2'లో విలన్​గా అధీరా... బాలయ్య దెబ్బను తట్టుకోగలడా? |  Nandamuri Balakrishna Boyapati Srinu Akhanda 2 Movie Villain Bollywood  Actor Sanjay Dutt Fix Full Detaisl Here - Telugu Filmibeat

ఇంకా చదవండి: 'భారతీయుడు-2' విడుదలకు సిద్దం

# Akhanda2     # Balakrishna     # BoyapatiSrinu     # SanjayDutt     # TeluguCinema    

related

View More
View More