ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ" రిలీజ్, ట్రైలర్ విడుదల !!!
4 months ago | 35 Views
మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ 'సంఘర్షణ'. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.
తాజాగా చిత్ర ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక క్యురియాసిటీని కలిగించే విధంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ బార్ట్లే అండ్ కేవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి సంఘర్షణ సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి.శ్రీనివాస్ రావ్ తెలిపారు.
నటీనటులు:
శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను, ఎక్స్ప్రెస్ హరి, స్వాతిశ్రీ చెల్లబోయిన, సుధాకర్ తదితరులు
నిర్మాత: వల్లూరి శ్రీనివాస్ రావ్
దర్శకత్వం: చిన్నా వెంకటేష్
సినిమాటోగ్రఫీ: కె.వి.ప్రసాద్, సుధాకర్ బార్ట్లే
సంగీతం: ఆదిత్య శ్రీరామ్
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
రిలీజ్: ( వన్ మీడియా) పార్థు రెడ్డి
ఇంకా చదవండి: యదార్థ ఘటనల ఆధారంగా తంగలాన్: చియాన్ విక్రమ్
# Sangharshana # ChinnaVenkatesh # ChaitanyaPasupuleti # August 9