సందీప్ కిషన్‌ కొత్త సినిమా  'వైబ్‌'

సందీప్ కిషన్‌ కొత్త సినిమా 'వైబ్‌'

3 months ago | 11 Views

'ఊరుపేరు భైరవకోన’ సినిమాతో ఈ ఏడాది హిట్‌ కొట్టాడు టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  అయితే ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు సందీప్‌. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, 'మిషన్‌ ఇంపాసిబుల్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాకు 'వైబ్‌' అని టైటిల్‌ పెట్టాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'వైబ్‌' ఫస్ట్‌ లుక్‌ గమనిస్తే.. ఫ్రెండ్ షిప్  బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. మనం చాలా మందిని కలుస్తాం.. అలా కలిసిన వారిలో కొంతమందిని ఇట్టే మర్చిపోతాం, మరి కొంతమందిని అలాగే గుర్తుంచుకుంటాం, అయితే..

అందులో కొంతమంది కోసం మాత్రమే పోరాడతాం. కొంతమంది స్నేహితులు మాత్రం నీ కోసంఫైట్  చేయడానికి రెడీగా ఉంటారు అంటూ ఈ పోస్టర్‌ కింద మేకర్స్‌ రాసుకోచ్చారు. ఇక ఈ సినిమాను మళ్ళీరావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ, మసూద.. లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నాడు.

ఇంకా చదవండి: హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘తమ్ముడు’.. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదల

# Ooruperubhairavakona     # Sundeepkishan     # Varshabollamma